వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటిష్ చరిత్రలో సిగ్గుచేటు సంఘటన: కామెరాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

David Cameron
అమృతసర్: 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ ఊచకోత బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సంఘటన అని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఈ ఊచకోత జరిగింది. జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించిన తొలి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మాత్రమే.

సంఘటనకు క్షమాపణ చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. బ్రిటన్ చరిత్రలో ఈ సంఘటన ఓ మచ్చగా మిగిలిపోతుందని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన యుకె ప్రభుత్వం ఆ సంఘటనకు విచారం వ్యక్తం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ఇక్కడ జరిగినదాన్ని మనం ఎన్నడూ మరిచిపోలేమని అని నోట్ బుక్‌లో రాసి నెవర్ అనే పదాన్ని రెండు సార్లు అండర్‌లైన్ చేశారు. ఆ సంఘటనను గుర్తు చేసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు యుకె సమ్మతిస్తుందనే విషయాన్ని ఖాయం చేయాల్సి ఉంటుందని అన్నారు. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన కామెరాన్ చివరి రోజు జలియన్‌వాలా బాగ్ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.

అది భయంకరమైన చర్య అని కామెరాన్ అన్నారు. జలియవన్‌వాలా బాగ్ స్మారక స్థలాన్ని ఆయన సందర్శించారు. భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతోనే జలియన్‌వాలా బాగ్‌పై కామెరాన్ విచారం వ్యక్తం చేశారని అంటున్నారు. ఆ తర్వాత ఆయన స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు.

ఆంగ్లో - ఇటాలియన్ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో సహకరిస్తామని కామెరాన్ హామీ ఇచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో మంగళవారం సమావేశమైన ఆయన ఆ హామీ ఇచ్చారు. తన భారత పర్యటనలో కామెరాన్ ప్రధానంగా వ్యాపారం, పెట్టుహడులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.

English summary

 British PM David Cameron on Wednesday described the 1919 Jallianwala Bagh massacre in Amritsar as "a deeply shameful event in British history", becoming the first serving prime minister to voice regret about one of the British Empire's bloodiest episodes in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X