హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మక్కా పేలుడు విక్టిం దిల్‌సుఖ్‌నగర్‌లోను గాయపడ్డాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Two Adilabad youth die
హైదరాబాద్: ఎస్సైలు కావాలనుకొని వచ్చిన ఇద్దరు యువకులు నగరంలోని దిల్‌సుఖ్ నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్న ఇద్దరు యువకులు ఫలహారం చేసేందుకు వచ్చి బాంబు బలైపోయారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని నంనూర్ గ్రామానికి చెందిన వడ్డే వినోద్ కుమార్ (24), ముత్యాల రాజశేఖర్(23)లు ఎంబిఏ పూర్తి చేశారు.

ఎస్సై ఉద్యోగానికి శిక్షణ నిమిత్తం 20 రోజుల క్రితమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక సంస్థలో శిక్షణ పొందుతున్నారు. గురువారం సాయంత్రం క్లాస్ ముగియగానే టిఫిన్ చేసేందుకు వచ్చారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. స్నేహితుల్దిరూ అక్కడికక్కడే మృతిచెందిన విషయాన్ని టివిల్లో చూసి తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌కు బయల్దేరారు.

మరోవైపు మక్కామసీదు ఘటనలో గాయపడ్డ అబ్దుల్ వాసిఫ్ మిర్జా అనే 25 ఏళ్ల వ్యక్తి దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల ఘటనలోనూ గాయపడ్డాడు. 2007లో జరిగిన మక్కా మసీదు బ్లాస్ట్స్‌లో మిర్జా తన ఎడమ కాలును కోల్పోయాడు. తాజా బ్లాస్టింగ్‌లోను అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇతను కొన్నాళ్లుగా పేలుడు జరిగిన థియేటర్ పరిసరాల్లో దుస్తులు అమ్ముతున్నాడు. గురువారం కూడా అమ్ముతుండగా పేలుడు జరిగి తీవ్రంగా గాయపడ్డాడు.

కాగా, దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లలో మృతి చెందిన 15 మందిలో 13 మందిని గుర్తించారు. 12 మందిని బంధువులకు అప్పగించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాల కోసం 9490616400 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చునని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

పేలుల్ల ఘటనలో గాయపడ్డ వారు నగరంలోని ఓమ్నీ, నాంపల్లి కేర్, యశోదా, ఉస్మానియా తదితర ఎనిమిది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పేలుళ్ల ఘటనలో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజస్థాన్‌కు చెందిన చోగారం కులాజీ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

English summary
Two Adilabad youth were killed in Dilsukhnagar bomb blasts on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X