హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుళ్లపై అమెరికా సాయంకోసం: దుబాయ్‌నుండి డబ్బు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Terrorists receive money by hawala
హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసును పోలీసులు ముమ్మరం చేశారు. జంట పేలుళ్ల కేసులో ఎఫ్‌బిఐ సహకారం తీసుకోవాలని ఎన్ఐఏ భావిస్తోంది. సిసిటివి వీడియోలతో పాటు ఇతర మార్గాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. సిసిటివి వీడియో, తదితర వాటి ఆధారంగా ఉగ్రవాదులకు నిధులు హవాలా మార్గం ద్వారా వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. దీనిపై ఎస్ఐఏ, ఐబి బృందాలు ఆరా తీస్తున్నాయి.

పేలుళ్లలో పాల్గొన్న ముగ్గురికి హవాలా ద్వారానే డబ్బులు సరఫరా అయినట్లు ఇంటెలిజన్స్ బ్యూరో గుర్తించింది. దీంతో ఎఫ్‌బిఐ సహకారం తీసుకునేందుకు ఎన్ఐఏ యోచిస్తోంది. దుబాయ్‌లోని అల్ ఖుజీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి దిల్‌సుఖ్ నగర్‌కు డబ్బు సరఫరా అయినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన యాసిన్ భక్తల్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మార్క్ చేసిన పోలీసులు

దిల్‌సుఖ్ నగర్‌లో సైకిల్ బాంబు పేలిన ప్రదేశాలని పోలీసులు ఇవాళ మార్కింగ్ చేశారు. ఘటనకు సంబంధించి సాధారణ దర్యాఫ్తులో భాగంగా కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల సమీపంలోని ఎ-1 మిర్చి సెంటర్, 107 బస్టాఫ్‌ల వద్ద సున్నంతో మార్కింగ్ చేశారు. సైకిల్ బాంబుల పేలుళ్లలో ధ్వంసమైన వాహనాల సంఖ్యలను సూచిస్తూ నెంబర్లు వేశారు.

పేలుడు తీవ్రతకు వంద మీటర్ల పరిధిలో దెబ్బతిన్న హోర్డింగులు, దుకాణాల అద్దాలకు సంబంధించిన వివరాలను పోలీసులు నమోదు చేసుకొన్నారు. ఘటనకు జరిగిన ప్రదేశాల్లో శకలాలు తొలగించి శుభ్రం చేసేందుకు ఎన్ఐఏ సంస్థ అనుమతి కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.

English summary
It is said that NIA is thinking to take the help of America's FBI in Dilsukhnagar blastings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X