జంటపేలుళ్లతో బాధలో ఉంటే తెలంగాణతో లింకా?: కవిత

ఇప్పటి వరకు రాష్ట్రం సమైక్యంగానే ఉందని, బాంబు పేలుళ్లు కూడా జరిగాయన్నారు. సమైక్య, విభజనకు పేలుళ్లతో సంబంధం పెట్టవద్దన్నారు. ఇప్పటికే పేలుళ్ల కారణంగా నగర ప్రజలు బాధలో ఉంటే ఇప్పుడు మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె అన్నారు.
కాగా అంతకుముందు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ కూడా చిన్న నీటి పారుదల శాఖ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు మంత్రిని వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు.
మృతుడి భార్యకు చెక్కు
దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో మరణించిన వెటర్నరీ వైద్యుడు వెంకటేశ్వర రావు కుటుంబానికి ప్రభుత్వం సహాయం కింద్ రూ.6 లక్షలను సంబంధింత శాఖ అధికారి మంగళవారం మృతుడి భార్యకు అందజేశారు. సైదాబాదు మండలం అస్మాన్‌గడ్‌లోని మృతుని స్వగృహంలో భార్య సుజాతకు ఆర్జెడి డాక్టర్ చెక్కును అందజేశారు. మృతుని భార్యకు ఉద్యోగం ఇవ్వనున్నట్లు అధికారి చెప్పారు.


Click it and Unblock the Notifications