వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో ఇష్టం లేకుండె, చిరుతో అయితే..: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇష్టం లేదని, తనపై అప్పుడు ఒత్తిడి తెచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. తాను అనుకున్నట్లు అప్పుడు చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే తమ పార్టీకి 50 స్థానాలు వచ్చేవని ఆయన అన్నారు. తనకు ఆ మేరకు గ్రౌండ్ రిపోర్టు ఉందని ఆయన అన్నారు.

శాసన మండలికి తెరాస తరఫున ఎన్నికైన కె.స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి మంగళవారమిక్కడ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. వారిని అభినందించిన కెసిఆర్, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిన వరదారెడ్డి అభ్యర్థిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.

నల్లగొండలోనూ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుండేదని కెసిఆర్ అన్నట్లు సమాచారం. "ఇక్కడ ఒక్క చోట ఓడిపోవటం వల్ల అందరూ నన్ను టార్గెట్ చేస్తారు'' అని అసహనం వ్యక్తం చేశారు. "వరదారెడ్డ్ఠి అభ్యర్థిగా పెట్టినా గెలవడని నేను ముందే చెప్పిన. అయినా పార్టీలో కొందరు నాపై ఒత్తిడి తెచ్చి ఆయన పేరును ప్రకటింపజేశారు'' అని చెప్పారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలోనూ అలాగే జరిగిందని అన్నారు.

స్వామిగౌడ్ ఎంపికే తన అంచనాలు నిజమవుతాయని చెప్పడానికి నిదర్శనమని గుర్తుచేశారు. వరదారెడ్డి అభ్యర్థిత్వాన్ని కొంచెం ముందుగా ప్రకటించకపోవటం కూడా ఓటమికి కారణమయ్యాయని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. యూటీఎఫ్‌సహా ఇతర అభ్యర్థుల ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వరదారెడ్డికి ఎక్కువగా పడకపోవటాన్ని ప్రస్తావించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా మహమూద్అలీ గెలుస్తారనే ధీమాను వ్యక్తంచేశారు. అనంతరం స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండలిలో తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపిస్తామని చెప్పారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao said that he was not interested to make alliance with Telugudesam in 2oo9 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X