తెలంగాణ ఏర్పాటు చేస్తాం: రాజ్‌నాథ్, చర్చించాం: అజిత్

పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రతిపాదిస్తే మద్దతు ఇచ్చేందుకు బిజెపితో పాటు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇ్చచిన కేంద్రం తెలంగాణ ఉద్యమకారులను అణచివేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. తెలంగాణ కోసం చాలా చాలా యేళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రాల విభజనపై యుపిఎ మంగళవారం జరిగన సమావేశంలో చర్చ జరిగిందని కేంద్ర మంత్రి, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ చెప్పారు. యుపిఎ సమావేశంలో తెలంగాణపై, ఉత్తరప్రదేశ్ విభజనపై చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. యుపిఎ సమావేశంలో రాష్ట్రాల విభజనపై చర్చ జరగడం శుభపరిణామమని ఆయన అన్నారు.
తెలంగాణపై కేంద్రం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications