హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

135సార్లు ఫోన్ చేసి దుర్భాషాలాడిన యువకుడి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Youth arrested in Hyderabad
హైదరాబాద్: ఓ యువకుడు తప్పతాగిన మైకంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పదే పదే ఫోన్‌లు చేసి అరెస్టయిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. సదరు యువకుడు ఒకే రాత్రి 135 సార్లు కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. అంతేకాదు సిబ్బందిని దుర్భాషాలాడాడు. దీంతో విసిగిపోయిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

హయత్ నగర్ బంజారాకాలనీలో ఉంటున్న భీమ్ లాల్ అనే ఇరవై రెండేళ్ల యువకుడు ఓ హెటల్‌లో పని చేస్తున్నాడు. సంపాదన అంతా తాగుడుకే ఖర్చు చేస్తుంటాడు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ పోలీసు కంట్రోల్ రూం 100కు ఫోన్ చేశాడు. దాదాపు 135 సార్లు అతను ఫోన్ చేయడమే కాకుండా సిబ్బందిని దుర్భాషాలాడాడు.

దీంతో పోలీసులు తమకు వచ్చిన సెల్ పోన్ నెంబర్ ఆధారంగా విచారణ మొదలు పెట్టారు. బుధవారం రాత్రి భీమ్ లాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించారు. స్నేహితులతో కలిసి పీకల దాకా తాగానని, కంట్రోల్ రూంకు ఫోన్ చేసినట్లు తనకు తెలియదని చెప్పాడు. స్నేహితులే కంట్రోల్ రూం నంబరు డయల్ చేసి ఇచ్చారని చెప్పాడుత. తాగిన మైకంలో ఏం మాట్లాడానో తెలియదన్నాడు.

దొంగల ముఠా అరెస్టు

ఎలక్ట్రానిక్ షోరూంలలో చోరీకి పాల్పడుతున్న ఓ ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి రూ.15 లక్షల విలువైన ఎలక్టారనికి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

English summary
A 22 year old young arrested in Hyderabad on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X