పాఠశాలలో మైనర్ బాలిక రేప్: ఢిల్లీలో నిరసనలు

బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రి వెలుపల ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి గురువారంనాడు బాలికపై అత్యాచారం జరిపాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం తమకు ఫిర్యాదు చేశారని, తాము కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.
తనపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనేది బాధితురాలు చెప్పలేకపోతోందని అన్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పాఠశాల పురుష ఉద్యోగులను ప్రశ్నిస్తున్నట్లు, ఉపాధ్యాయులనూ ఓ గార్డునూ విచారిస్తున్నామని చెప్పారు.
తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగల్‌పురి ప్రజలు స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట శుక్రవారం ఉదయం మూడు గంటల పాటు ధర్నా చేశారు. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారిని చెదరగొట్టడానికి బాటోన్స్ వాడారు.












Click it and Unblock the Notifications