వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసంపై రేవంత్ సవాల్: డేట్ చెప్పమన్న మేకపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy - Mekapati Rajamohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశ్యం ఉంటే రాష్ట్ర గవర్నర్ ముందు ఆ పార్టీకి చెందిన నేతలు తమకు మద్దతిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులతో కలిసి పరేడ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ఆదివారం సవాల్ విసిరారు. ఓ టివి ఛానల్ కార్యక్రమంలో ఆయన జగన్ పార్టీకి ఈ సవాలును విసిరారు.

ఆ పార్టీ నిజంగానే ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే పరేడ్‌కు సిద్ధపడాలన్నారు. కాంగ్రెసులోని జగన్ ఎమ్మెల్యేలను బయటకు తీసుకు రావాలన్నారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి సవాలును తాను స్వీకరిస్తున్నానని మేకపాటి చెప్పారు. తాము అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

గవర్నర్ ముందు పరేడ్‌కు రేవంత్ రెడ్డి లేదా తెలుగుదేశం పార్టీ తేది నిర్ణయిస్తే తాము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. టిడిపి జగన్ జైలు నుండి బయటకు రాదని భావిస్తోందని వారికి వచ్చే నెలలో నిరాశ ఎదురవుతుందని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు, తెదేపాల మధ్య గత కొన్నాళ్లుగా అవిశ్వాస విషయమై రచ్చ రచ్చ అవుతున్న విషయం తెలిసిందే. అవిశ్వాసం పెట్టాలని జగన్ పార్టీ అంటుండగా... అవిశ్వాసం పేరుతో అమ్ముడు పోవాలని చూస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. గతంలో తాము అవిశ్వాసం పెడితే బేరాలు జరిపారని మండిపడుతున్నారు.

English summary
Telugudesam Party leader Revanth Reddy has challenged YSR Congress party on no confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X