మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజమే, జులై దాకా అంతే: విద్యుత్‌ సమస్యపై కిరణ్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
మెదక్: రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉన్న మాట వాస్తవమేనని, అయితే కరెంట్ సమస్య తాత్కాలికమేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూలై నాటికి విద్యుత్ సమస్య పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. యూనిట్‌కు రూ. 12 చొప్పున విద్యుత్తును కొంటున్నామని అన్నారు. విద్యుత్ కోసం ప్రతి నెల రూ. 300 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి బుధవారం మెదక్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టారు. బహీరాబాద్ వద్ద మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాలు విస్తారంగా కురిస్తే కరెంట్ సమస్య తీరిపోతుందని ఆయన చెప్పారు. గ్యాస్ కొరత, వర్షాలు తగినంతగా పడకపోవడం వల్లే విద్యుత్తు సమస్య తలెత్తిందన్నారు.

రైతులకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్‌పై రాష్ట్రం రూ. 5,500 కోట్లు భరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. యువత చదువుకు తగ్గ ఉద్యోగాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు.

ఇదిలావుంటే, కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు 90 రోజుల్లో నిర్వహిస్తామని ఆ లేఖలో చెప్పారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్రం నుంచి రావల్సిన రూ. 1582 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు.

English summary
CM Kiran kumar Reddy said that power crisis will be solved in the month of July. He said that power crisis is prevailing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X