ఓఎంసి కేసులో 884కోట్ల ఆస్తుల జప్తు: తీర్పు వాయిదా

ఉదయం ఈ కేసులో ఆస్తుల జప్తుపై ఈడి న్యాయప్రాధికారిక సంస్థ ముందు గురువారం ఉదయం విచారణ ప్రారంభమైంది. గాలికి చెందిన రూ.884 కోట్ల ఆస్తుల జప్తుపై ఈడి వాదనలు వినిపించింది. గాలి తరఫు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. బ్రహ్మణీ స్టీల్స్ షేర్లను అధిక ధరకు అమ్ముకుని వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని గాలి జనార్ధన్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు గాలి జనార్ధన్ రెడ్డిని బెంగళూరుకు తరలించారు.
మరోవైపు అంతకుముందు ఓఎంసి కేసులోనే కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని ప్రాసిక్యూషన్ చేసేందుకు కేంద్రం గురువారం అనుమతించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టం అభియోగాల పైన శ్రీలక్ష్మిని విచారించేందుకు అనుమతిని ఇచ్చింది.
ఐపిసి, పిసి యాక్టుల కింద విచారించేందుకు అనుమతి లభించింది. ఓఎంసికి గనుల లీజు కట్టబెట్టడంలో శ్రీలక్ష్మి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. శ్రీలక్ష్మిపై ఐపిసి అభియోగాలను సిబిఐ కోర్టు ఇప్పటికే విచారణకు స్వీకరించింది. తన బెయిల్ పిటిషన్‌ను పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కేంద్రం ఆమెను విచారణకు అనుమతించడం ఎదురు దెబ్బే!












Click it and Unblock the Notifications