వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెర్రరిజానికి సమాధానం: చిరు, వారసత్వ సిటీ ఓరుగల్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: ఉత్తమ వారసత్వ నగరంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఓరుగల్లు నగరం బహుమతిని గెలుచుకుంది. కేంద్ర పర్యాటక శాఖ అవార్డులను ఆ శాఖ మంత్రి కొణిదెల చిరంజీవి మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. 36 కేటగీరీల్లో ఉత్తమ అవార్డులు పొందిన 86 అవార్డులను చిరంజీవి ప్రకటించారు. ఉత్తమ సాముదాయక పర్యటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ ర్వాత రాజస్థాన్, గుజరాత్‌లు రెండు, మూడు అవార్డులను గెలుచుకున్నాయి.

ఉత్తమ పౌర గుర్తింపు నిర్వాహక నగరంగా జిహెచ్ఎంసి బహుమతి గెలుచుకుంది. ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయంగా శంషాబాద్ విమానాశ్రయం, ఉత్తమ వారసత్వ నగరంగా ఓరుగల్లు, ఉత్తమ ఆసుపత్రిగా హైదరాబాదులోని అపోలో, ఉత్తమ పర్యాట సంస్థగా ఎపిటిడిపి, ఉత్తమ పోర్టుగా విశాఖపట్నం, ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్‌లు గెలుచుకున్నాయి. బెస్ట్ కన్వెన్షన్ సెంటర్‌గా హెచ్ఐసిసి ఎంపికయింది. లైఫ్ ఆఫ్ పై సినిమాకు, పుస్తకానికి ప్రత్యేక జాతీయ అవార్డును ప్రకటించారు.

ఉత్తమ అవార్డుల అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... ఏప్రిల్ 12 నుండి 14 వరకు హైదరాబాదులో ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. సదస్సును అడ్డుకునేందుకే హైదరాబాదులో బాంబు పేలుళ్లు జరిపారన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచ పర్యాటక సదస్సును ఆపలేవన్నారు.

బాంబు పేలుళ్ల ప్రభావం పర్యటక శాఖపై పడదన్నారు. ఉగ్రవాదానికి సమాధానమే టూరిజం అని చెప్పారు. హైదరాబాదులో జరుగనున్న సదస్సును విజయవంతం చేయడమే అటుంటి దాడులకు సరైన సమాధానమని చెప్పారు. సదస్సు అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయనే సమాచారం ఉందన్నారు.

English summary
Central tourism minister Chiranjeevi has announced best tourism awards on Tuesday in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X