ఎపిపై దృష్టి: బొత్సకు రాహుల్ పరీక్ష, కిరణ్‌కు పిలుపు!

Rahul Gandhi
హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. తెలంగాణ సెంటిమెంట్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెసు పార్టీని రాష్ట్రంలో మరోసారి నిలబెట్టే అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశే కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలతో త్వరలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్ర రాజకీయాలు, 2014 సార్వత్రిక ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై సమాలోచనలు చేసి, తగిన సలహాలను, సూచనలు ఇస్తారని సమాచారం. ఈ నెల 18 తర్వాత ఏ క్షణమైనా వీరిద్దరికి రాహుల్ గాంధీ నుండి వీరికి పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ అపాయింటుమెంటును బొత్స కోరారు. అలాగే కిరణ్‌ను కూడా రాహుల్ అదే సమయంలో పిలిచే అవకాశాలు ఉన్నాయి.

కాగా, రాహుల్ వ్యవహార శైలి పిసిసి చీఫ్‌లకు మింగుడు పడడం లేదట. నాయకత్వ సామర్థ్యాన్ని పరీక్షించడానికి రాహుల్ ఇటీవల పిసిసి చీఫ్‌లకు నాలుగు పేజీల ప్రశ్నాపత్రాన్ని పంపించారు. దీనిలో "మీరు రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు పర్యటించారు? ఎన్ని సభలు నిర్వహించారు? చివరి కార్యవర్గ సమావేశం ఎప్పుడు జరిగింది? రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ప్రజా సమస్యలను వివరించండి? తదితర ప్రశ్నలున్నాయట.

దీనికి తోడు వీరిచ్చే జవాబులను కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష నేత, ఏఐసిసి రాష్ట్ర ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి కూడా అవి నిజమేనని సంతకం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పిసిసి చీఫ్ ఎవరూ అబద్ధం చెప్పే వీలుండదు. ఇలా రాహుల్ గాంధీ పరీక్ష పెట్టడం పిసిసి చీఫ్‌లకు మింగుడు పడటం లేదట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+