బాబు కాళ్ల దగ్గర.. తొమ్మిదేళ్లు: నాగం X మోత్కుపల్లి

Mothkupalli Narasimhulu-Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ నగారా సమితి చీఫ్, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి మధ్య గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర చర్చ సాగింది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఇరువురు ఒకరికొకరు తారాసపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య తెలంగాణ అంశం చర్చకు వచ్చింది. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇరువురు నేతలు స్థాయిల గురించి మాట్లాడుకునే స్థాయికి వెళ్లారు. పరస్పరం దూషించుకున్నారు. బాబు కాళ్ల వద్ద పడి ఉన్నారని నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ టిడిపి ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. అందుకు మోత్కుపల్లి... టిడిపి అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల బాబు పాలనలో ఆయన కాళ్ల దగ్గరే మీరు ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. అప్పుడు మంత్రి పదవి కూడా అనుభవించారు కదా అన్నారు.

తాను తెలంగాణ ద్రోహులతో మాట్లాడదల్చుకోలేదని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. అందుకు మోత్కుపల్లి... దొరతనం ఇంకా పోలేదని, దొరతనం చూపిస్తున్నారని అన్నారు. ఇరువురి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకోవడంతో కాసేపటికి ఇరువురు అక్కడి నుండి వెళ్లిపోయారు.

అసెంబ్లీ రేపటికి వాయిదా

రెండోసారి అరగంట వాయిదా పడిన అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైన కాసేపటికే మళ్లీ వాయిదా పడింది. విద్యుత్ కోతల పైన తెలుగుదేశం, ఇతర విపక్షాలు, తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి పట్టుబట్టింది. స్పీకర్ వారికి సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. విపక్షాలు పోడియం చుట్టుముట్టాయి. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+