జగన్ పార్టీ నన్నడగలేదు: జయసుధ రాజకీయ వైరాగ్యం

Jayasudha
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరికపై తనను ఆ పార్టీ నేతలు ఎవరూ సంప్రదించలేదని సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే జయసుధ గురువారం అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాజకీయాల్లో ఉండాలా వద్దా అనే విషయమై ఇంకా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె చెప్పారు. అవిశ్వాసం కోసం ఎవరి వద్దతు అవసరం లేదన్నారు.

సికింద్రాబాదు నియోజకవర్గం నుండి 2009 సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన జయసుధ ఇటీవల రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్సిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటానని ఆమె చెప్పలేదు. కానీ ప్రస్తుత రాజకీయాలపై మాత్రం ఆమె పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు.

నాలుగు రోజుల క్రితం ఆమె మాట్లాడుతూ... వైయస్ జగన్ పార్టీ నుంచే కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా తనకు ఆఫర్ రావచ్చునని చెప్పారు. పార్టీలోకి రావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఆఫర్ ఉందా అని అడిగితే ఆమె ఆదివారం శాసనసభ లాబీల్లో ఆ విధంగా అన్నారు.

జగన్ పార్టీ నుంచే కాదు, టిడిపి నుంచి కూడా తనకు ఆఫర్ రావచ్చునని, అయితే దాన్ని అంగీకరిచాలా వద్దా అనేది తన వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. ఇది కూడా సినిమాల్లో ఆఫర్ వచ్చినట్టేనని, ఒకేసారి చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తే ఆ సినిమా చేస్తే బాగుంటుందా? అందులో నా పాత్ర పండుతుందా? అంతిమంగా సినిమా సక్సెస్ అవుతుందా, లేదా? అన్నది చూసుకోవాలని, పార్టీల విషయంలోనూ అంతేనని ఆమె వివరణ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+