హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రోతల్ హౌస్ ఆర్గనైజర్ హత్య: బిటెక్ విద్యార్థి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

 B-Tech student held in murder case
హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన జరిగిన 30 ఏళ్ల బ్రోతల్ హౌస్ నిర్వాహకుడి హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఓ బిటెక్ విద్యార్థి కూడా ఉన్నాడు. జె వెంకట్ రెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు ఘట్కేసర్‌లోని పర్వతాపూర్‌ రియల్టర్లు సిహెచ్ జయశంకర్ రెడ్డి, సిహెచ్ మల్లికార్జున రెడ్డి, వారి అనుచరుడైన 17 ఏళ్ల బిటెక్ విద్యార్థిని వనస్థలిపురంలో అరెస్టు చేశారు.

పర్వతాపురానికి చెందిన జె వెంకటరెడ్డిని వారు ముగ్గురు మార్చి 6వ తేదీన హత్య చేసి అతని శవాన్ని హయత్‌నగర్ సమీపంలోని బాటసింగారం గ్రామం వద్ద పడేశారు. తన వ్యాపార భాగస్వామి రాజేందర్ రెడ్డిని చంపిన కేసులో వెంకట్ రెడ్డి నిందితుడు. ఈ హత్య కేసులో వెంకట రెడ్డిని ఉప్పల్ పోలీసులు జనవరిలో అరెస్టు చేశారు. మార్చి 2వ తేదీన అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు.

హత్య కేసులో ఉప్పల్ పోలీసులు వెంకట రెడ్డి వ్యాగనార్‌ను స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం - ఆ కారును మల్లికార్జున్ రెడ్డి పేరు మీద కుదువ పెట్టారు. వెంకటరెడ్డి వాయిదాలు చెల్లించకపోవడంతో వాటి కోసం పైనాన్షయర్స్ మల్లికార్జున రెడ్డిపై ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. చర్లపల్లి జైలులో ఉన్నప్పుడు వెంకటరెడ్డిని మల్లికార్జున్, జయశంకర్ కలిసి కారు అప్పును తీర్చాలని అడిగారు.

అందుకు వెంకటరెడ్డి నిరాకరించాడు. దీంతో తమను వెంకటరెడ్డి చంపుతాడని వారిద్దరు భయపడ్డారు. దీంతో వెంకటరెడ్డి హత్యకు వారిద్దరు కుట్ర చేశారు. కారు రుణం గురించి మాట్లాడడానికి ఎల్బీ నగర్ క్రాస్ రోడ్డుకు రావాలని వారు వెంకటరెడ్డిని కోరారు.

ఎల్బీ నగర్‌కు వచ్చిన వెంకటరెడ్డిని మార్చి 6వ తేదీన తమ స్విఫ్ట్ కారులో వనస్థలిపురంలోని తమ బంధువుల తీసుకుని వెళ్లారు. అక్కడ వారిద్దరితో పాటు బిటెక్ విద్యార్థి వెంకట్ రెడ్డి గొంతు నులిమి చంపి, శవాన్ని బాటసింగారంలో పడేశారు.

English summary
Police have arrested three persons, including a B Tech student, for their role in the murder of a 30-year-old brothel organiser on March 6.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X