Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీనగర్ ఫైరింగ్‌పై షిండే ప్రకటన: ఓమర్‌పై జవాన్ల కన్నెర్ర

Sushil Kumar Shinde - Omar Abdullah
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జవాన్‌లపై జరిగిన కాల్పుల అంశం మీద ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి అధికా పక్షం తలొగ్గింది. శ్రీనగర్ కాల్పులపై ప్రకటన చేయాలని బిజెపి డిమాండ్ చేయడంతో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం పార్లమెంటులో కాల్పులపై ప్రకటన చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే పాకిస్తాన్‌తో ఇక చర్చల ప్రసక్తే లేదని ఆయన సభాముఖంగా తేల్చి చెప్పారు.

కాశ్మీర్‌లో ఉగ్రవాద కాల్పులు, ఇతర సమస్యలపై లోకసభలో, శ్రీలంకలో భారత జాతర అరెస్టు అంశంపై రాజ్యసభలో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఉభయ సభల స్పీకర్లు చేసిన విన్నపాన్ని విపక్షాలు పట్టించుకోలేదు. దీంతో స్పీకర్‌లు ఉభయ సభలను శుక్రవారానికి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు పార్లమెంటును కుదిపేశాయి.

భారత జాలర్ల అరెస్టుపై లోకసభలో డిఎంకె, అన్నా డిఎంకె, రాజ్యసభలో అన్నా డిఎంకే పార్టీ ప్రతినిధులు వెల్‌లోకి చొచ్చుకు వెళ్లారు. శ్రీలంక నావికాదళం చేతిలో అరెస్టయిన యాభై మంది జాలర్లను విడుదల చేయించాలని వారు డిమాండ్ చేశారు. వారికి ఇతర విపక్షాలు కూడా తోడయ్యాయి.

మరోవైపు జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సిఆర్పిఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంఘటనలో బుధవారం ఐదుగురు జవాన్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి అంత్యక్రియలకు గురువారం జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా రాకపోవడంతో జవాన్‌లు తీవ్ర నిరసన తెలిపారు. బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సిఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు బుధవారం దాడి చేయగా.. ఈ దాడిలో ఐదుగురు సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+