బాలయ్య చెప్పలేదు, ఎన్టీఆర్ టూర్ తెలియదు: రావి

Balakrishna-Jr Ntr
విజయవాడ: సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమానికి హాజరు కాకూడదని నందమూరి హీరో, తమ పార్టీ నాయకుడు బాలకృష్ణ తమకేమీ చెప్పలేదని తెలుగుదేశం కృష్ణా జిల్లా నాయకుడు రావి వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమానికి దూరంగా ఉండాలని బాలకృష్ణ తమ పార్టీ నేతలను ఆదేశించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమానికి హాజరు కాకూడదని తనకే కాదు, ఎవరికి కూడా బాలయ్య చెప్పలేదని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమం గురించి తమకు సమాచారం లేదని ఆయన అన్నారు. గుడివాడ శానససభా నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన కొడాలి నానిని ఓడిస్తామని ఆయన చెప్పారు.

కాగా, విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వహించిన బ్రైడ్ ఆఫ్ ఇండియా నగల ఉత్సవం సీజన్ - 3 ప్రివ్యూ కోసం ఆ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ వచ్చారు. మహాత్మా గాంధీ రోడ్డులోని గేట్‌వే హోటల్ వద్ద అబిమానులకు ఆయన అభివాదం చేస్తూ సందడిగా గడిపారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు.

ఎన్టీఆర్ విజయవాడ పర్యటనలో ఆయనకు, సీనియర్ ఎన్టీఆర్‌కు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు మాత్రమే కనిపించాయి. బాలకృష్ణ ఫ్లెక్సీలు, బ్యానర్ల ఊసు లేదు. తెలుగుదేశం పార్టీ బ్యానర్లు కూడా కనిపించలేదు. బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలపై కొంత మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ కట్టుకథలని వారు కొట్టిపారేశారు. నందమూరి కుటుంబంలో విభేదాలు ఉంటే వారు పరిష్కరించుకుంటారని మరి కొంత మంది అన్నారు. మొత్తం మీద, జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ పర్యటన మరోసారి నందమూరి కుటుంబంలోని విభేదాలను రచ్చకీడ్చిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+