నటి కవిత కూతురు మాధురి పెళ్లి వివాదం: రాజు అరెస్ట్

తమకు ఐదు నెలల కూతురు ఉందని, రాజు తమ కుటుంబానికి ఆధారమని, అతనిపై కేసు పెట్టవద్దని వేడుకుంది. పోలీసులు మాత్రం ఆమె నుంచి ఫిర్యాదు తీసుకొని రాజుపై 420, 494 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం అతనిని రిమాండుకు తరలించారు.
సినీ నటి, టిడిపి నేత మహిళ కుమార్తెను పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్ తెలిసిందే. వారిది ప్రేమ వివాహం కాదని, అతను మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఐదేళ్ల కింద రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం తనకు రెండుసార్లు వివాహం అయిన విషయాన్ని రాజు కూడా అంగీకరించాడు. మాధురికి తనకు ఎటువంట సంబంధం లేదని చెప్పాడు.
కరీంనగర్ జిల్లాకు చెందిన రాజు 2005లో అదే ప్రాంతం కొత్తపల్లికి చెందిన అన్నపూర్ణను స్థానిక దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2008లో సింగాపురం గ్రామానికి చెందిన జయశ్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత, కాపురాన్ని నగరానికి మార్చాడు. వారాసిగూడ ఇందిరానగర్‌లో భార్య, సోదరుడితో కలిసి ఉంటున్నాడు.
ఐదు నెలల కిందట కూతురు కూడా పుట్టింది. రెండేళ్లుగా సినీ నటి కవిత ఉంటున్న అపార్ట్‌మెంట్ కింది భాగంలో ఒకరి వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే మాధురితో పరిచయం ఏర్పడింది. ఈ నెల 13న ఆమెను పెద్దపల్లికి తీసుకెళ్లి అక్కడి దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. కూతురు కనిపించకపోవడంతో మాధురి తండ్రి దశరథ రాజ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో, పోలీసులు ప్రత్యేక బృందాన్ని పెద్దపల్లికి పంపించి వారిని నగరానికి తీసుకొచ్చారు. అయితే, 15వ తేదీ రాత్రి ఓ వివాహిత రాజు తన భర్త అంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తన పేరు జయశ్రీ అని, 2008లో ఇరువురం ప్రేమించి దేవాలయంలో పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపింది. పెళ్లినాటి ఫొటోలను చూపింది. దీంతో రాజు బాగోతం బయటపడింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications