అధికారుల సహకారం లేకుండా..: జగన్ కేసుపై ఈడి

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్ పైన ఈడి న్యాయప్రాధికారిక సంస్థలో సోమవారం వాదనలు ముగిశాయి. తదుపరి వాదనలను న్యాయప్రాధికారిక సంస్థ ఏప్రిల్ 1వ తేదికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా జగతి, రాంకీ, ఈడి తదితరాలకు న్యాయప్రాధికారిక సంస్థ పలు ఆదేశాలు జారీ చేసింది.

వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జగతి, రాంకీ ఫార్మా సహా మరో రెండు కంపెనీలను ఆదేసిచింది. అక్రమాస్తులకు కారణమైన వివాదాస్పద జివోల కాపీలను తమకు అందించాలని ఈడి(ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్)కు ఆదేశించింది. అలాగే, ఆదాయపన్ను శాఖ నిర్వహించిన విచారణ స్టేట్‌మెంటును తమ ముందు ఉంచాలని ఈడిని న్యాయ ప్రాధికారిక సంస్థ ఆదేశించింది. ఈ సందర్భంగా ఈడి... అధికారుల సహకారం లేకుండా నేతలు నల్లధనం, అక్రమ సంపాదనకు పాల్పడలేదని అభిప్రాయపడింది.

కాగా, వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఆరు నెలల క్రితం కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల కేసులో ఈడి మనీలాండరింగ్ చట్టాల ఉల్లంఘనలను ఈడి నిర్ధారించింది. ఈ మేరకు ఈడి 51 కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులను జప్తు చేసింది. కుట్రల ద్వారా తాము ఆస్తులు జప్తు చేసిన సంస్థలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాయని ఈడి వ్యాఖ్యానించింది.

హెటిర్ డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అలాగే జననీ ఇన్‌ఫ్రాకు చెందిన 13 ఎకరాల భూములను కూడా జప్తు చేసింది. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ సంస్థకు చెందిన 14.5 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అరబిందో ఫార్మాకు చెందిన 96 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+