వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస ఎమ్మెల్యేలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajendar - KT Rama Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులపై స్పీకర్ ఒకరోజు సస్పెన్షన్ వేటు వేశారు. వాయిదా అనంతరం పది గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ సమయంలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలని తెరాస ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ తెరాస ఎమ్మెల్యేలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేసారు. తీర్మాన ప్రతిపాదన మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రవేశ పెట్టారు.

సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం కూడా ఎమ్మెల్యేలు సభలోనే ఉండి నినాదాలు చేశారు. దీంతో మార్షల్స్ వారిని బయటకు తీసుకు వెళ్లారు. కల్వకుంట్ల తారక రామారావు, భిక్షపతి, గంప గోవర్ధన్, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, నల్లాల ఓదేలు, రాజయ్య, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, చెన్నమనేని రమేష్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ భాస్కర్‌, ఈటెల రాజేందర్ తదితరులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

తెలంగాణపై తేల్చక పోవడం వల్ల సమావేశాలు సజావుగా సాగలేకపోతున్నాయని, తెలంగాణపై తీర్మానం పెట్టాలని గూండా మల్లేష్ డిమాండ్ చేశారు. జూలకంటి రంగారెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్ పార్టీయే కుమ్మక్కు

అధికార కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే కుమ్మక్కయిందని టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వారికి కాంగ్రెసుతో బేరసారాలు కుదరక పోవడం వల్ల తమపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.

English summary

 MLAs of Telangana Rashtra Samiti (TRS) were today suspended from the Andhra Pradesh Assembly for the day for disrupting the proceedings of the House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X