వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇష్యూ: కెసిఆర్, రాములమ్మ వాకౌట్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - Vijayasanthi
న్యూఢిల్లీ : లోక్ సభ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖరరావు, విజయశాంతి లోకసభ నుంచి వాకౌట్ చేశారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే నిరుడు డిసెంబర్ 28 నాటి అఖిలపక్షం సమావేశంపై చర్చకు కేసీఆర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆ తీర్మానాన్ని స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు.

దాంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. సభను స్పీకర్ 15 నిముషాలపాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత మాట్లాడేందుకు స్పీకర్ మీరాకుమార్ కెసిఆర్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో బీజేపీ సీనియర్ నేత అద్వానీతోపాటు మిగిలిన సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో చర్చించాల్సిన విషయాన్ని ఇప్పుడెందుకుని వారన్నారు.

ఈ చర్యను నిరసిస్తూ కేసీఆర్, విజయశాంతి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై ప్రకటన చేసి మూడేళ్లు దాటినా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కార్యరూపం దాల్చలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కారణంగా అనేకమంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.లోకసభ సమావేశాలకు హాజరు కావడానికి కెసిఆర్ విజయశాంతితో కలిసి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.

బేణీ ప్రసాద్ వ్యాఖ్యలపై గొడవ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా పడ్డాయి. సోమవారం సభలో ఉక్కు శాఖ మంత్రి బేణి ప్రసాద్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు విపక్షాలకు అడ్డుచెప్పడంతో సభలో గందరగోళం నెలకొంది. సభాపతి ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. సభా కార్యాక్రమంలకు అంతరం ఏర్పడడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. క్షమాపణలు చెప్పడానికి బేణీ ప్రసాద్ నిరాకరించారు. దీంతో ఆరోపణలు, ప్రత్యారోపణలతో లోకసభ దద్ధరిల్లింది.

బేణీ ప్రసాద్ వర్మ ఆరోపణలను ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ తప్పు పట్టారు. ఉగ్రవాదాలను రెచ్చగొడుతున్నారంటూ బేణీ ప్రసాద్ ఆరోపించారు. కౌన్ కిస్ కా అంటూ బేణీ ప్రసాద్ వర్మ ములాయంపై విరుచుకుపడ్డారు. బేణీ ప్రసాద్ వర్మకు, ములాయం సింగ్ యాదవ్‌కు మధ్య వాగ్వివాదం చెలరేగింది. బేణీ ప్రసాద్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ములాయం డిమాండ్ చేశారు.

English summary
Telangana Rastra Samithi (TRS) MPs K Chandrasekhar Rao and Vijayashanthi gave staged walk out from Loksabha on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X