జగన్ పార్టీలోకి మరో ఇద్దరు: బలిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఆ సభకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వస్తారని, ఆ లోపు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదలైతే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సోమవారం ఆయన లోటస్ పాండులో విజయమ్మను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను కొనసాగించే సత్తా జగన్‌కు మాత్రమే ఉందన్నారు.
సిపిఐ మాజీ ఎమ్మెల్యే
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ఖమ్మం జిల్లా సిపిఐ మాజీ శాసనసభ్యుడు పి.వెంకటేశ్వర్లు కూడా వెళ్లనున్నారు. ఆయన గతంలో సిపిఐ తరఫున ఎమ్మెల్యేగా ఖమ్మం జిల్లాలో గెలుపొందారు. ఇప్పుడు ఆయన జగన్ పార్టీ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అతను ఈ రోజు(మంగళవారం) అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలువనున్నారు.












Click it and Unblock the Notifications