రత్నగిరిలో నదిలో పడిన బస్సు: 37 మంది మృతి

గోవా నుండి ముంబయికి వెళ్తున్న ఈ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి గురైనట్లుగా చెబుతున్నారు. గోవా - ముంబయి రోడ్డు హైవే. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి నదిలో పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం వేములోవలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పూరింటిలో మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. దీంతో సమీపంలోని ఇరవై పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు.
విశాఖలో లారీలు ఢీ
విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట మండలంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications