సాక్షి, మైసూరాలపై సభా హక్కుల నోటీసు యోచన?

కాంగ్రెసుకు టిడిపి దగ్గరవుతోంది
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికార కాంగ్రెసు పార్టీ మీద తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో విమర్శలు చేస్తూ అసెంబ్లీలో కాపాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. టిడిపి కాంగ్రెసులో కలవడం ఖాయమన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు ఖద్దరు టోపీలు ధరించి వచ్చారని, ఇదే ఆ పార్టీలు కలుస్తాయనేందుకు మంచి ఉదాహరణ అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబే కాపాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడానికి కారణం అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీయే కారణమన్నారు. బడ్జెట్‌కు, కార్యాచరణకు తేడా తెలియని మంత్రులు మంత్రివర్గంలో ఉండటం సిగ్గు చేటు అని, వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా అధికార పార్టీ సభను వాయిదా వేసి పారిపోతోందని ఆ పార్టీ విమర్శించింది. సభలో ఏ అంశం చర్చకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భేషజాలకు పోకుండా సభను నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications