కావూరితో వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్య, నవ్వించిన బొత్స

Kavuri Sambasiva Rao - Venkaiah Naidu
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కావూరు సాంబశివ రావుతో మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంపీలు కావూరు సాంబశివ రావు, రాపోలు ఆనంద భాస్కర్ తదితరులతో మాట్లాడుతుండగా వెంకయ్య నాయుడు అక్కడికి వచ్చారు.

రాగానే ఆయన కావూరిని చూసి మీరేమిటి తిరుపతిలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రధాని మంత్రి అవుతారని చెప్పారని అడిగారు. దీనికి కావూరు జవాబివ్వకుండా నవ్వుతూ కూర్చున్నారు. ఆ తర్వాత వెంకయ్యనే కావూరిని ఉద్దేశించి రాష్ట్రంలో బిజెపికి అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని మీ నియోజకవర్గమైన ఏలూరులోనే 60 శాతం మంది ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎంతకాలం ఉంటే తమకు అంత ప్రయోజనం చేకూరుతుందని, అయితే ఇప్పుడైనా ఎన్నికలకు సిద్ధమేనని వెంకయ్య చెప్పారు.

రాష్ట్రంలోను, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించినప్పుడు బొత్స జోక్యం చేసుకుని.. నిండా మునిగాక చలేమిటని వ్యాఖ్యానించారట. బొత్స వ్యాఖ్యలు అక్కడున్న వారందరికీ నవ్వు తెప్పించింది. అంతలోనే సర్దుకున్న బొత్స మీరన్నట్లుగా నరేంద్ర మోడీకి పట్టణాల్లో కొంత అనుకూలత ఉండవచ్చనని కాని, గ్రామాల్లో మాత్రం ఆయనకు ఓట్లు రావని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+