కాంగ్రెసు ఎంపి హర్షకుమార్‌కు అరెస్టు వారంట్

కృష్ణస్వరూప్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదులో మేరకు కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. అతను ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి - 2004లో ఎంపీగా ఎన్నికైన హర్షకుమార్‌కు నగరంలోని వుడా చిల్డ్రన్ థియేటర్‌లో సన్మానం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ప్రస్తుత రాష్ట్ర మంత్రి కోండ్రు మురళి, మాజీ ఎమ్మెల్యే రవికుమా ర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎం.నాగార్జున హాజరయ్యారు.
ఆ సన్మాన సమావేశంలో తనపై నాగార్జున, హర్షకుమార్ అనుయాయులు దాడి చేశారంటూ కృష్ణస్వరూప్ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో న్యాయస్థానం కేసును దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
కేసు విచారణకు హాజరు కావాలని పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్‌కు సూచించింది. అయినప్పటికీ ఎంపీ హర్షకుమార్ న్యాయస్థానానికి హాజరు కాకపోవడంతో మంగళవారం అరెస్టు వారెంట్ జారీచేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల పదో తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications