వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్‌ను డౌన్ చేసేందుకే కిరణ్ అకౌంట్: బాబు సర్వే...'

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఒంగోలు: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నియంత్రించేందుకే ఈ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు బుదవారం అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతలు కోసం చేసిన పోరాటాలతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బెంబేలెత్తి పోయిందని విమర్శించారు.

అందుకే హడావుడిగా ప్రత్యేక రైతు బడ్జెట్ అని ప్రవేశ పెట్టిందన్నారు. బిఏసిలో చర్చించకుండానే వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టడం రాజ్యాంగ విరుద్దమని, జగన్‌ను నియంత్రించేందుకే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం మొద్దులా వ్యవహరిస్తోందన్నారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబుకు బడ్జెట్ చదవడమే రాలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సర్వే ప్రకారం తమకు 191 సీట్లు వస్తాయన్నారు.

అందుకే చంద్రబాబు కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారన్నారు. కేంద్ర ప్రభుత్వం పతనం అంచున ఉందని, ఎప్పుడైనా పడిపోవచ్చునన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతు రుణమాఫీ చేయాలంటే విశాల హృదయం ఉండాలని, అది వైయస్ ఒక్కరికే సాధ్యమైందన్నారు. వైయస్ సంక్షేమ పథకాలను జగన్ అధికారంలోకి వస్తే కొనసాగిస్తారన్నారు.

96వ రోజుకు షర్మిల పాదయాత్ర

వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర నేటితో 96వ రోజుకు చేరుకుంటుంది. షర్మిల తన పాదయాత్రను ఈ రోజు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని పెద్దపూడి శివారు నుండి ప్రారంభిస్తారు. పురవేదిక బహిరంగ సభలో ప్రసంగించి రాత్రికి అక్కడే బస చేస్తారు.

English summary

 YSR Congress Party spokes person Jupudi Prabhakar Rao said on Wednesday that Agriculture budget was produced in Assembly to control YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X