వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్న వైయస్ జగన్ కోసం...: షర్మిల పాదయాత్ర సెంచరీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila -YS Jagan
హైదరాబాద్/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి వంద రోజులకు చేరుకుంటుంది. ఆమె గతేడాది అక్టోబర్ 18వ తేదిన కడప జిల్లా ఇడుపులపాయ నుండి పాదయాత్రను ప్రారంభించారు. 58 రోజుల పాదయాత్ర తర్వాత మోకాలి గాయం కారణంగా విరామం ఇచ్చారు. చికిత్స అనంతరం ఫిబ్రవరి 6 నుంచి పాదయాత్రను పునఃప్రారంభించారు.

మొత్తం యాత్రలో భాగంగా షర్మిల ఇప్పటి వరకు 1,375 కిలోమీటర్లు నడిచారు. నడక ద్వారా ఏడు జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టారు. ప్రస్తుతం ఆమె గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆదివారం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సహా పలువురు పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ జిల్లాకు వస్తున్నారు. జగన్ జైలుకు వెళ్లడంతో పార్టీ పటిష్టత కోసం ఆమె పాదయాత్ర చేపట్టారు.

కాగా, శనివారం తన పాదయాత్రలో షర్మిల ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమిళనాడులో డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి యూపిఏ నుండి తప్పుకుంటున్నామని ప్రకటన చేయగానే ఆయన కుమారుడు స్టాలిన్ ఇంటి పైన కేంద్రం సిబిఐ దాడులు చేయించిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు పార్లమెంటులో దీనిపై ప్రశ్నించిన తర్వాత సిబిఐ దాడులపై వెనక్కి తగ్గిందని ఆమె అన్నారు.

జగన్.. కాంగ్రెసుకు వ్యతిరేకమయ్యాకే కేంద్రం ఆయన ఆస్తులపై దర్యాఫ్తు సంస్థలను ప్రయోగించారన్నారు. చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని, అందుకే ఆయనపై ఎలాంటి విచారణలు జరగవన్నారు. దర్యాఫ్తును చేయించడం లేదు కాబట్టే బాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం లేదన్నారు. రాజన్న పాలనలో ప్రజలపై పన్నుల భారం వేయకుండా అభివృద్ధిని సాధించారని షర్మిల చెప్పారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy's sister Sharmila Maro Praja Prastanam padayatra reaches 100 days today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X