వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ కూడలిలో నాగం జనార్ధన్? బిజెపివైపు మొగ్గు

By Srinivas
|
Google Oneindia TeluguNews

nagam janardhan reddy
హైదరాబాద్: తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ కూడలిలో నిల్చున్నారు. తెలంగాణ నినాదంతో తెలుగుదేశం పార్టీని వీడిన నాగం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఒంటరిగా తెలంగాణ నినాదం ఎత్తుకోవడంతో ఆయనకు తెలంగాణవాదుల నుండి గట్టి మద్దతు ఉంది. అయితే, ఆయనకు ఇప్పటి వరకు సరైన రాజకీయ వేదిక లేదు.

తెలంగాణ నగారా సమితిని స్థాపించినప్పటికీ అందులో చెప్పుకోదగ్గ నేతలు లేరు. తెలంగాణ కోసం టిడిపిని వీడిన ఆయన ఆ పార్టీ తెలంగాణకు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉంటే తప్ప ఆ పార్టీలో తిరిగి చేరే అవకాశాలు లేవు. టిడిపి తెలంగాణకు కొంత అనుకూలంగా మారినప్పటికీ నాగంకు కావాల్సింది కేవలం అనుకూలంగా ఉండటం మాత్రమే కాకుండా పార్టీ పరంగా పోరాడటం. రెండు ప్రాంతాల్లో ఉన్న టిడిపికి ఇది కష్టమే అని చెప్పవచ్చు.

ఇక, అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీయే తెలంగాణను తేల్చక పోవడంలో అసలు దోషి. కాబట్టి ఆ పార్టీలో చేరే అవకాశాలు ఏమాత్రం లేవు. ఉద్యమం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితితో కొంతమేర కలిసి వెళ్తున్నా పూర్తి స్థాయిలో ఆ పార్టీని నాగం ఆమోదించడం లేదు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీయే అయినప్పటికీ ఆ పార్టీలోని కొన్ని లోటుపాట్లను ఆయన ఎత్తి చూపిస్తున్నారు. ఈ కారణంతో ఆ పార్టీలో చేరేందుకు ఆయన ఇష్టపడటం లేదు.

కొంతకాలం క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే, ఆ పార్టీ తెలంగాణ పట్ల సానుకూలంగా లేదు. దీంతో అందులోకి వెళ్లడం ఆయనకు ఇష్టం లేదు. గతంలో ఆ పార్టీలే చేరుతారనే ప్రచారం సాగినా అసలు ఆయన అటువైపు ఆలోచనే చేయడం లేదనే వారు కూడా ఉన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న జాతీయ పార్టీ అయిన బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది.

నాగం ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరుతానని చెప్పలేదు. అయితే, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న, 2014లో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇచ్చే సామర్థ్యం ఉన్న బిజెపితో కలిసి ఉద్యమం చేసేందుకు ఆయన ఎక్కువ ఇష్టపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో వ్యక్తిగా అయినా క్రియాశీలకంగా ఉన్న నాగం కోసం తెరాస, బిజెపితో పాటు పలు పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ కూడలిలో ఉన్న నాగం... వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీలో చేరక తప్పదంటున్నారు.

అది బిజెపియే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగం బిజెపిలో చేరితే ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏ పార్టీలో చేరే విషయమై నాగం మాత్రం ఇప్పటి వరకు మాట్లాడలేదు. అయితే, ఆయన బిజెపితో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీలో చేరకున్నా బిజెపి, తెరాస ఎవరికి వారు 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన మద్దతు కూడా బిజెపికే ఉండే అవకాశాలు ఉన్నాయి.

English summary
It is said that Telangana Nagara Samithi chief and 
 
 Nagarkurnool MLA Nagam Janardhan Reddy may join in 
 
 Bharatiya Janta Party before 2014 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X