చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయకాంత్‌కి షాక్: 6గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayakanth
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ఆరుగురు డిఎండికె ఎమ్మెల్యేలపై వేటు పడింది. విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికె పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను ఏడాది పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. తమిళ అసెంబ్లీలో డిఎండికె పార్టీ ఎమ్మెల్యేలకు, పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సభ నుండి ఆరుగురు డిఎండికె సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

ఇతర ఎమ్మెల్యేలపై దాడికి దిగడంతో స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ రోజు వారిపై వేటు పడింది. గత నెల డిఎండికె సభ్యులు గొడవ పడ్డారు. డిఎండికె సభ్యులు విసి చంద్రకుమార్, కె నల్లతంబి, డి మురుగేశన్, ఎస్ సెంథిల్ కుమార్, బి పార్థసారథి, ఆర్ అరుల్ సెల్వన్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు.

గతేడాది తమిళనాడు ఎన్నికల్లో డిఎండికె పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేల్లో కొందరు అధికార పార్టీ అన్నాడిఎంకె వైపు వెళ్లారు. అందులో మైఖేల్ రాయప్పన్ ఉన్నారు. ఆయనపై డిఎండికె సభ్యులు సభలోనే దాడి యత్నం చేశారు. కాగా, వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ సంవత్సరం పాటు జీతాలు ఉండక పోవడమే కాకుండా ఇతర అలవెన్సెస్ కూడా ఉండవు.

కాగా, మహారాష్ట్రలోను ఇటీవల ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఓ పోలీసు అధికారిని అసెంబ్లీ ప్రాంగణంలో చితకబాదిన ఐదుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ ఈ ఏడాది ఆఖరు వరకు సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు తమిళనాడులో ఆరుగురు ఎమ్మెల్యేలను ఏడాది సస్పెండ్ చేశారు.

English summary
Six opposition DMDK MLAs were today suspended from the Tamilnadu Assembly for one year in connection with the assault on a dissident DMDK legislator inside the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X