వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేరే పార్టీలో ఇమడలేను: రాయపాటి, జగన్ పార్టీపై జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao - JC Diwakar Reddy
గుంటూరు/హైదరాబాద్: తాను ముప్పై అయిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర ఏ పార్టీలోకి వెళ్లనని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సోమవారం చెప్పారు. ఒకవేళ తాను ఇతర పార్టీలలోకి వెళ్లినా అక్కడ ఇమడడం చాలా కష్టమే అన్నారు.

తాను అసలు ఆ విషయాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదని రాయపాటి ఈ సందర్భంగా చెప్పారు. మంగళగిరిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్టు విషయమై అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు.

జగన్ పార్టీతో క్షణం ఉండలేరు

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సిపిఎం ఒక్క క్షణం కూడా స్నేహంగా ఉండలేదని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి సోమవారం హైదరాబాదులో అన్నారు. విద్యుత్ సమస్యపై ఇందిరా పార్కు వద్ద దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వస్తున్నారని సిపిఎం శాసనసభా పక్ష నేత జూలకంటి రంగారెడ్డి అసెంబ్లీ లాబీల్లో అన్నారు.

విజయమ్మ తమ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారని జూలకంటి అన్నారు. ఈ సమయంలో అటుగా వస్తున్న జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... మా కామ్రేడ్‌ను ఏమంటున్నారని నవ్వుతూ ఆరా తీశారు. దీక్షా శిబిరానికి విజయమ్మ వెళ్తున్న విషయాన్ని విలేకరులు జెసికి వివరించారు. ఆమె సంఘీభావం తెలిపినా సిపిఎం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ఉండలేదని జెసి అన్నారు.

English summary

 Guntur MP Rayapati Sambasiva Rao has said on Monday that he will not quit Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X