గంటల్లోనే మళ్లీ: మెట్రో స్టేషన్‌లో కాల్పులు, భార్య హతం

వీరని సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. గాయపడ్డ ఇరువురిలో ఒకరు మృతి చెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగాయి. మామ, భార్య పైన అల్లుడు కాల్పులు పవన్ కుమార్ కాల్పులు జరిపాడు. నిందితుడు ఉపయోగించిన డబుల్ బ్యారెన్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి భార్య దీప్తి, తండ్రి భీషంలను పవన్ కుమార్(నిందితుడు) దూరం నుండి కాల్చి గన్ అక్కడే వదిలి పారిపోయాడు. దీప్తి మృతి చెందగా ఆమె తండ్రి చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసు దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, ఈ ఘటనకు కొద్ది గంటల ముందే ఉదయం ఢిల్లీ ఫామ్‌హౌస్‌లో బిఎస్పీ నేత దీపక్ భరద్వాజ్‌ను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. అతను 2009 లోకసభ ఎన్నికల్లో బిఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. దక్షిణ ఢిల్లీలోని రాజోక్రిలో గల తన ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో దీపక్ భరద్వాజ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దీపక్ భరద్వాజ్ ఆ తర్వాత మరణించారు.
గుర్తు తెలియని సాయుధ దుండగులు ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. నల్లటి స్కోడా కారులో ఫామ్‌హౌస్‌లో చొరబడ్డ ఇద్దరు దుండగులు దీపక్ భరద్వాజ్ ఎక్కడున్నాడో తెలుసుకుని హత్య చేశారు. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసిన సంపన్నుల్లో దీపక్ భరద్వాజ్ ఒక్కరు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన 600 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను చూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో ఆయనకు హోటల్ బిజినెస్, విద్యా వ్యాపారం ఉన్నాయి.
అంతేకాకుండా టౌన్‌షిప్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఫామ్‌హౌస్‌లోకి వచ్చి 62 ఏళ్ల దీపక్ భరద్వాజ్‌పై కాల్పులు జరిపినవారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. దీపక్ భరద్వాజ్‌తో నల్ల స్కోడా కారులో వచ్చిన వారు వాగ్వివాదానికి దిగినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత కాల్పులు జరిపి పారిపోయారని తెలుస్తోంది. కాల్పుల్లో భరద్వాజ్ అనుచరుడు గాయపడ్డాడు. కాల్పులు జరిపినవారు భరద్వాజ్‌కు తెలిసినవారే అయి ఉంటారని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications