వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే జగన్ పార్టీ నుండి సమాధానం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
గుంటూరు/హైదరాబాద్: తెలుగుదేశం కాంగ్రెసు పాలనపై బ్లాక్ పేపర్ ఇస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి లేఖ విడుదలయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బుధవారం ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి తాము బ్లాక్ పేపర్ ఇస్తే జగన్ పార్టీ నుండి ప్రకటన ఎందుకు విడుదలయిందో చెప్పాలన్నారు. లేఖ విడుదల చేయాల్సిందిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కిరణ్ సూచించినట్లుగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు ఒక్కటే అనేందుకు ఇదే నిదర్శనం అన్నారు. అంతకుముందు టిడిపి బ్లాక్ పేపర్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

కాగా, సభలో సమరం ముగించిన విపక్షాలు ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. విద్యుత్‌పై రగిలిన వేడిని సర్కారు దిగి వచ్చేదాకా కొనసాగించాలని తీర్మానించాయి. విద్యుత్ సమస్యలపై ఏప్రిల్ 1నుంచి దశల వారీగా ఉద్యమం చేపట్టాలనీ... గ్రామ స్థాయి నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు. ప్రజల సంతకాలతో గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. కరెంటు విషయంలో ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని టిడిపి నేతలు హెచ్చరించారు.

విద్యుత్ సమస్యపై శాసన సభలో సర్కారుపై సమర భేరీ మోగించిన టిడిపి జనక్షేత్రంలో అంతకుమించి పోరాటపటిమ చూపాలని నిర్ణయించుకుంది. విద్యుత్ సమస్యపై గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటన్నింటినీ 19వ తేదీన హైదరాబాద్‌కు తరలించి గవర్నర్‌కు సమర్పిస్తామని తెలిపారు.

టిడిపి ప్రజా ప్రతినిధులు చేపట్టిన నిరాహార దీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. తొలిరోజు 25 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు దీక్ష చేపట్టగా... బుధవారం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కూడా దీక్షలో చేరారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఉమా మాధవరెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, పరిటాల సునీత, సీతా దయాకరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పూసపాటి అశోక్ గజపతిరాజు, పార్థసారధి, ఊకె అబ్బయ్య, వెంకట రమణారావు, ఎల్. రమణ, పి.రాములు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, ప్రకాశ్ గౌడ్, పర్సా రత్నం, బల్లి దుర్గా ప్రసాదరావు, కె. రామకృష్ణ, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సతీశ్‌రెడ్డి, సలీం తదితరులు రిలేదీక్షలు చేశారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, కొనకళ్ళ నారాయణరావు కొంతసేపు దీక్షలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు.

English summary

 Telugudesam Party senior leader Yanamala Ramakrishnudu has questioned YSR Congress response on TDP's black paper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X