జగన్ పార్టీలో చిచ్చు: నిజామాబాద్ జిల్లా కన్వీనర్ రిజైన్

వెంకరమణారెడ్డి బాటలో నాలుగు నియోజకవర్గ నేతలు నడుస్తారని అంటున్నారు. నేడో, రేపో వారంతా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కార్యకర్తలకు, కష్టపడే నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ పెద్దనేత డబ్బు దండుకుని నియోజవర్గ ఓ ఆర్డినేటర్లను నియమించారని మండిపడ్డారు. కష్టపడే వారిని పక్కనబెట్టి పార్టీలో ఇటీవల చేరిన ధనవంతులకు టికెట్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సమన్వయకర్తల నియామకం పలు జిల్లాల్లో చిచ్చు రేపుతోంది. ప్రస్తుతం నియమించిన సమన్వయకర్తలకే వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు లభిస్తాయనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతో సమన్వయకర్తల పదవులు లభించని నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అదే సమయంలో వివిధ నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!