మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగ.. నువ్వే, ఎవడ్రా నువ్వు: ముత్యం వర్సెస్ ఫారూక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Medak Dist
మెదక్: మెదక్ జిల్లా డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒకరిపై మరొకరు తిట్ల దండకం అందున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ శనివారం ఒకరిపై మరొకరు విరుచుకు పడ్డారు. నువ్వెవడ్రా అంటే నువ్వెవరని విమర్శలు గుప్పించుకున్నారు. మెదక్ జిల్లా సమీక్ష మండలి సమావేశం సంగారెడ్డిలో జరిగింది. ఈ సమావేశంలో వారిద్దరూ అసభ్యంగా తిట్టుకోవడమే కాదు.. దాదాపు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. అది కూడా ఇద్దరు మహిళా మంత్రుల సంక్షంలోనే కావడం గమనార్హం.

ఆరు నెలల తర్వాత మెదక్ జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీనికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి డికె అరుణ అధ్యక్షత వహించగా, జిల్లాకు చెందిన డాక్టర్ గీతా రెడ్డి కూడా హాజరయ్యారు. సమావేశంలో పారిశుధ్యంపై సమీక్ష జరుగుతుండగా తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా రూ.5 లక్షలు ఎలా కేటాయించారని అధికారులను ప్రశ్నించారు. అది ముత్యంరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్‌ల మధ్య వాగ్వాదానికి దారితీసింది.

నువ్వు దొంగవంటే నువ్వు దొంగవు అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. దాంతో ఎమ్మెల్యేలు నర్సా రెడ్డి, కిష్టా రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డికె అరుణ కల్పించుకుని వారిని శాంతింపజేశారు. ఈ గొడవ అంతటితో అయిపోలేదు. ఉపాధి హామీ గురించి చర్చ జరుగుతుండగా ముత్యం రెడ్డి తాను తన నియోజకవర్గ నిధుల నుంచి డ్వాక్రా భవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చానని కానీ, ఎన్ని బావుల పూడికలు తీశారో అధికారులు లెక్కలు ఇవ్వలేదని మండిపడ్డారు.

ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఎమ్మెల్సీ ఫారూఖ్ కల్పించుకుని ఆడవారిని గౌరవించేలా మాట్లాడాలని ముత్యం రెడ్డికి సూచించారు. దాంతో మరోసారి దూషణలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా వారు తిట్టుకున్నారు. తర్వాత ఫారూక్ మాట్లాడుతుండగా ముత్యం రెడ్డి అడ్డుపడ్డారు. నువ్వెవడివి నా నియోజకవర్గం గురించి మాట్లాడేందుకని ముత్యం రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కూడా అదేస్థాయిలో మండిపడ్డారు. ఇతరులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

English summary

 Dubbaka MLA Muthyam Reddy and MLC Farooq Hussain were created very tension on Saturday in Medak district DRC meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X