వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూసైడ్‌లపై వ్యాఖ్య: రేణుకా చౌదరిపై బొత్సకు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Renuka Choudhary
హైదరాబాద్: తెలంగాణ ఆత్మహత్యలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ మంగళవారం డిమాండ్ చేశారు. కోదండరామ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐకాస ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఆయన నివాసంలో కలిశారు.

రేణుకా చౌదరి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. కోదండరామ్‌తో పాటు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. బొత్సను కలిసిన అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. రేణుకా చౌదరి విషయమై తాము బొత్సకు ఫిర్యాదు చేశామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రేణుక వ్యాఖ్యలపై రేపు అన్ని జిల్లాల్లో నిరసనలు వ్యక్తం చేయాలని జిల్లా ఐకాస నేతలకు వారు పిలుపునిచ్చారు.

రేణుకా చౌదరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆమె నిజంగా తెలంగాణలో జన్మించినట్లయితే వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీవిగా భావించాలా? లేక వ్యక్తిగతమైనవా? చెప్పాలన్నారు.

రేణుకా చౌదరి ఢిల్లీలో ఉంటూ సీమాంధ్రకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేణుకా చౌదరి బహిరంగా క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో తిరగనివ్వమని, ఆమెకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రేణుక అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉద్యమాన్ని కించపరుస్తున్నారన్నారు.

English summary

 Telangana Joint Action Committee lashed out at Rajyasabha Member and Congress Party spokes person Renuka Choudhary on Teusday for her comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X