విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూ ఎన్టీఆర్: జగన్నే కోరుకంటున్నారని జోగి సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jogi Ramesh
విజయవాడ: కృష్ణా జిల్లా పెడన కాంగ్రెసు తిరుగుబాటు శాసన సభ్యుడు జోగి రమేష్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఫ్లెక్సీలలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఇటీవల కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై జోగి స్పందించారు. నందమూరి అభిమానులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకోవడం లేదన్నారు.

నందమూరి అభిమానులు అందరు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ విజయవాడకు వచ్చినప్పుడు ఆయన కార్యక్రమంలో పాల్గొనవద్దని చంద్రబాబు నాయుడు నాయకులను, కార్యకర్తలను ఆదేశించారని ఆరోపించారు. చంద్రబాబు నందమూరి అభిమానుల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. అందుకే జగన్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ సోదరి షర్మిల పాదయాత్రను ఎన్టీఆర్ అభిమానులు స్వాగతిస్తున్నారన్నారు.

కాగా, కరెంటు ఛార్జీలపై ముఖ్యమంత్రి ప్రకటన కంటితుడుపు చర్య అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హైదరాబాదులో అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గ్రామాల్లో ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. ఆయన కేంద్రం దిగుమతి చేసుకున్న వస్తువు అన్నారు.

దీక్ష చేస్తున్న తమ ఎమ్మెల్యేలను బలవంతంగా అరెస్టు చేస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యేలకు ఆరోగ్యం క్షీణించిందని.. అయినా ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్బంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు.

English summary
Krishna district Peadana MLA Jogi Ramesh make controversial comments that Nandamuri fans are not believing TDP chief Nara Chandrababu Naidu. He said they are believing YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X