ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు నడక మిత్రుడు, నేను అనుకున్నదొకటి: కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నడక మిత్రుడు అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి ఈ రోజు పర్యటించారు. జిల్లాలోని వేగవరంలో సోలార్ విద్యుత్ దీపాలను ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పైన గిరిజనులతో ముచ్చటిండారు. గిరిజనులకు అమలవుతున్న పథకాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విద్యుత్ విషయంలో ప్రతిపక్షాల ఆందోళనలు డ్రామాలు అని కొట్టి పారేశారు. సభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ఉప ప్రణాళికను ప్రవేశ పెడితే ప్రతిపక్షాలు మద్దతిస్తాయని తాను అనుకున్నానని ఆయన చెప్పారు. కానీ, అడ్డుకునే ప్రయత్నం చేశాయని ఆరోపించారు.

ఇక్కడి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పైన ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో బిసిలకు తక్కువ కేటాయిస్తే తమ ప్రభుత్వం అంతకు నాలుగు రెట్లు కేటాయిస్తుందన్నారు. ఉప ప్రణాళిక సభలో పెడుతుంటే నడక మిత్రుడు చట్టం కంటే నడక ముఖ్యమనుకున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం ఎంత మంచిగా పని చేసిన ప్రతిపక్షాలు విమర్శించడం సహజమన్నారు. తమ ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయలు మంజూరు చేస్తామన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said on Friday that TDP, YSR Congress and Telangana Rastra Samithi tried to block SC, ST sub plan bill in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X