ఢిల్లీ షేమ్: మహిళా నేతపై రోడ్డు మీదే దాడికి యత్నం

గురువారం రాత్రి ఇంటికి వెళ్తుండగా రద్గీగా ఉండే దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి సమీపంలో ఐదుగురు వ్యక్తులు ఆమెపై దాడికి ఒడిగట్టారు. తన ఇంటికి వెళ్తుండగా తన కారు ప్రమాదానికి గురైందని వాణి చెప్పారు. తన కారు వెనక భాగాన్ని వేరే వాహనం ఢీకొట్టిందని, వారంతా తాగినట్లున్నారని, తమ డ్రైవర్‌ను బయటకు లాగి, తన కారులో ఎక్కడానికి ప్రయత్నించారని ఆమె వివరించారు.
రోడ్డు మీద వేలాది కార్లు ఉన్నాయని, ఏ ఒక్కరు కూడా సాయం చేయడానికి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన డ్రైవర్ లేకుంటే తనకు ఏమై ఉండేదనే భయం తనను పట్టుకుందని ఆమె చెప్పారు. తాను 100 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పానని, అయితే పోలీసులు వచ్చేసరికి తాను లాక్ చేసుకుని ఉండకపోతే తనను చంపేసేవారో, రేప్ చేసేవారో తెలియదని ఆమె వ్యాఖ్యానించారు.
పోలీసులు వచ్చేలోగా వారు పారిపోయారు. నిర్భయ సామూహిక అత్యాచారానికి గురైన స్థలానికి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఇది జరిగిందని ఆమె చెప్పారు. నిర్భయ సంఘటనను వాణి త్రిఫాఠీ గుర్తు చేశారు. వృత్తిరీత్యా వాణి త్రిఫాఠీ నటి. మహిళ, యువతకు సంబంధించిన సామాజిక సేవా కార్యకర్త కూడా.












Click it and Unblock the Notifications