సిగ్గుంటే ఎన్టీఆర్ ఫొటో వాడరు: జగన్ పార్టీపై దేవినేని

సిగ్గు, లజ్జ, నైతిక విలువలు ఉంటే ఎవరూ ఇలాంటి పని చేయరని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లాలో దిగజారుడు రాజకీయాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఫొటోలు వేయించుకుంటే జనాలు రారని విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ ఫొటోను కూడా ఫ్లైక్సీలపై వేయిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, వెనుకబడిన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించటానికి రూ. 2 లకే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్ళు, తదితర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు సంపాదించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తన భర్త అనిల్‌కు బయ్యారం గనులు దోచిపెట్టిన షర్మిల ఫొటోల నడుమ ఎన్టీఆర్ ఫొటోను ముద్రించటం దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications