Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కన్నడ పోల్స్: బరిలో పూజా గాంధీ, చిరు ప్రచారం

Chiranjeevi-Pooja Gandhi
బెంగళూరు: కర్ణాటక శానససభ ఎన్నికల్లో సినీ తారలను పోటీకి దించేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. కర్ణాటక శాసనసభకు మే 5వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సినీ గ్లామర్‌కు ఏ మాత్రం కొదవ ఉండబోదన్న విషయం అర్థమవుతోంది.. సినీ గ్లామర్‌ను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

బిజెపికి చెందిన మాజీ మంత్రి బి.శ్రీరాములు ఏర్పాటు చేసిన బిఎస్‌ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసే ఇద్దరు కన్నడ నటీమణుల పేర్లను శుక్రవారం ప్రకటించి ఈ రేసులో అన్ని పార్టీల కంటే ముందు నిలిచింది. రాయచూర్ నియోజకవర్గం నుంచి పూజా గాంధీని, చామరాజనగర్ నియోజకవర్గం నుంచి రక్షిత ప్రేమ్‌లను పోటీకి నిలుపుతున్నట్టు ఆ పార్టీ వెల్లడించింది.

సినీ గ్లామర్‌ను ఉపయోగించుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మిగిలిన రాజకీయ పక్షాలతో తీవ్రంగా పోటీపడుతోంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీలో సభ్యురాలిగా ఉన్న ప్రముఖ నటి భావన, మరో నటి రమ్య, అంబరీష్, దర్శన్ తదితరులు ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు పొరుగున గల జిల్లాల్లో చిరంజీవినీ ప్రచార రంగంలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యూహరచన చేస్తోంది.

ఇదిలావుంటే, జగదీష్ షెట్టార్ మంత్రి వర్గం నుంచి ఇటీవల వైదొలిగిన రాజు గౌడ అలియాస్ నరసింహ నాయక్ శుక్రవారం జెడి (ఎస్) లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికె ట్ ఆశించిన రాజు గౌడ ఇంతకుముం దు ఆ పార్టీలో చేరాలని భావించినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో జెడి (ఎస్) తీర్థం పుచ్చుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+