వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికీలీక్స్: స్వీడిష్ జెట్ డీల్‌లో రాజీవ్ మధ్యదళారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajiv Gandhi
న్యూఢిల్లీ: తాజాగా వికీలీక్స్ వెల్లడించిన విషయాలు దేశంలోని రాజకీయాల్లో దుమారం పరిస్థితిని కల్పించే అవకాశం ఉంది. స్వీడిష్ జెట్స్ అమ్మకాలకు సంబంధించి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆయుధ ఏజెంట్‌గా వ్యవహరించినట్లు వికీలీక్స్ వెల్లడించింది. అమెరికా దౌత్యసంబంధమైన కేబుల్స్‌ను వికీలీక్స్ బయటపెట్టింది.

అమెరికా దౌత్యసబంధమైన కేబుల్స్‌కు సంబంధించి వికీలీక్స్ వెల్లడించిన వివరాలపై ది హిందూ ఓ వార్తాకథానాన్ని ప్రచురించింది. భారతదేశంలో స్వీడిష్ కంపెనీ సాబ్ - స్కానియా తన విగ్గెన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విక్రయించాలని తలపెట్టినప్పుడు రాజీవ్ గాంధీ మధ్యవర్తిగా వ్యవహరించి ఉంటారని ఆ వివరాలు తెలియజేస్తున్నాయి.

రాజీవ్ గాంధీ ప్రధాని కావడానికి చాలా ఏళ్ల ముందు 1970లో ఆ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. అప్పుడు రాజీవ్ గాంధీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ పైలట్‌గా పనిచేస్తున్నారు. కిసింజర్ కాలానికి చెందిన ఆ రహస్యాల వెల్లడి దుమారం రేపే అవకాశం ఉంది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడైన రాజీవ్ గాంధీ స్వీడిష్ కంపెనీ తరఫున సంప్రదింపులు జరిపాడా, లేదా అనేది ఎవరూ తేల్చడం లేదు. ఈ సమాచారాన్ని ధ్రువీకరించడానికి గానీ తిరస్కరించడానికి అమెరికా అధికారుల వద్ద అదనపు సమాచారం లేదని వికీలీక్స్ కేబుల్ వ్యాఖ్యానించింది. రాజీవ్ గాంధీని ఎంటర్‌ప్రెన్యూర్‌గా అభివర్ణించింది.

రాజీవ్ గాంధీ పాత్ర ఉన్నట్లు చెబుతున్న వికీలీక్స్ వెల్లడిపై బిజెపి అధికార కాంగ్రెసు పార్టీపై విమర్శలు చేస్తోంది.

English summary
In what may trigger a political storm in the country, the latest WikiLeaks revelations from US Embassy cables have projected former Prime Minister Rajiv Gandhi as an arms agent for a deal related to the sale of Swedish jets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X