వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబిత రాజీనామా చేస్తానన్నారు: బొత్స, విహెచ్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి తాజా ఛార్జీషీటులో తన పేరు ఉండటంతో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి రాజీనామాకు మొగ్గు చూపారు. ఆమె రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి రాజీనామా చేస్తానని, ఆమోదించాలని కోరారు. అయితే, అందుకు కిరణ్ ససేమీరా అన్నారని సమాచారం.

పూర్తి వివరాల అనంతరం ఆలోచించుదామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు రాకుండా ఉండేందుకు కనీసం తన శాఖనైనా మార్చాలని ఆమె కోరారు. అందుకు కూడా కిరణ్ నో చెప్పారట. కాగా, సబిత రాజీనామా అంశంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... సబిత రాజీనామా చేయాలని భావించారని, తన పేరు ఛార్జీషీటులో ఉన్నందున మంత్రి పదవిలో కొనసాగడం భావ్యం కాదని ఆమె చెప్పారన్నారు. అయితే, అన్ని పరిణామాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చునని ముఖ్యమంత్రితో పాటు అందరు ఆమెకు నచ్చజెప్పారన్నారు.

వేరు వేరు న్యాయమా?

జగన్ అక్రమాస్తుల కేసు చార్జిషీటులో పేరు చేర్చినందున సబిత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు డిమాండ్ చేశారు. సబిత మంత్రి పదవిపై ఓసారి ఆలోచించుకోవాలన్నారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి హోంమంత్రిగా ఉంటే ప్రజల మదిలో కొత్తరకమైన ప్రశ్నలు తలెత్తే అవకాశముందన్నారు. రాజీనామా చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీయే వత్తాసు పలుకుతుందని ప్రజలు భావించే ప్రమాదముందని.. చార్జిషీట్లలో పేరున్న మంత్రులందర్నీ పదవిలోంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

సబిత రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలని మాజీ మంత్రి శంకర్ రావు డిమాండ్ చేశారు. మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఒక న్యాయం, సబితకు మరో న్యాయం ఉండకూడదని అన్నారు. సబితతో పాటు ధర్మానను కూడా కేబినెట్ నుంచి తొలగించాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

English summary

 Home minister Sabitha Indra Reddy's name has been included in YSR Congress president YS Jagan case as accused 4. CBI has filed fifth chargesheet in YS Jagan case on Dalmiya cements. Congress Party leaders like VH and Shankar Rao demanded Sabith's resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X