ఎన్టీఆర్ ఏ ఒక్కరి ట్రేడ్ మార్క్ కాదు: మైసురా రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర సందర్భంగా ఏర్పాటుచేస్తున్న ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫొటో పెట్టడంపై మీడియా ప్రతినిధులు స్పందన కోరినప్పుడు - "దాంతో మాకేం సంబంధం. ఈ అంశంపై పార్టీ పరంగా ప్రకటన ఇవ్వాల్సిన అవసరంలేదు. ఎవరో చేసిందానికి, మేమెందుకు జవాబు చెప్పాలి'' అని ఆయన సమాధానమిచ్చారు.
"ఎన్టీఆర్ ప్రముఖ సినీ నటుడు. చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు. సీఎంగా పనిచేశారు. ఆయనపై చాలా మందికి అభిమానం ఉండవచ్చు. అందులో తప్పేమి లేదు. ప్రజాభిమానం ఉన్నప్పుడు, ఎవరైనా ఆయన ఫొటో పెట్టుకోవచ్చు" అని ఆయన అన్నారు.
ఎన్టీఆర్‌పై ప్రేమ-అభిమానం ఉండేవారు ఎవరైనా, దానికి సంతోషించాలని, అంతేకాని బాధపడటం, రాజకీయాలు చేయటం, ఊరంతా ఖండించాలనటం సరి కాదని, వాళ్లు సమస్య సృష్టించుకున్నారని, దాన్ని అందరిపై రుద్దటం తప్పు అని మైసూరా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications