వారు వీరయ్యారు!: కిరణ్‌పై రూటుమార్చిన బొత్స, చిరు

అయితే, చిరు, బొత్సలు గతంలో వలె కాకుండా కిరణ్ పైన తమ రూటును మార్చినట్లుగా కనిపిస్తోంది. అంతకుముందు కిరణ్‌తో బొత్స నేరుగా తలపడినట్లుగా కనిపించే వారు. ఆయనపై కాలు దువ్వేవారు. చిరంజీవి మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకు పోయినట్లుగా కనిపిస్తుండేవారు. ఇప్పుడు బొత్స దూకుడును తగ్గించి మౌనంగా కిరణ్‌పై పైచేయి కోసం చూస్తుండగా.. చిరంజీవి మాత్రం దూకుడు పెంచారనే చెప్పవచ్చు.
అందుకు ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు గుర్తిస్తే అలాగే కనిపిస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు సందర్భంగా కిరణ్‌ను బొత్స వెనుకేసుకొచ్చినట్లుగా కనిపిస్తూనే ప్రభుత్వానికి చురకలు అంటించారు. విద్యుత్ ఛార్జీల పెంపు కిరణ్ ఒక్కడి నిర్ణయం కాదని, ఆతనికి మద్దతు పలికినట్లుగా కనిపించినా.. ఛార్జీల పెంపుపై పునరాలోచించాల్సిన అవసరముందని చెప్పారు. ఇక చిరంజీవి ఈ విషయమై బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
విద్యుత్ పెంపుపై చిరంజీవితో పాటు ఆయన వర్గానికి చెందిన మంత్రి సి.రామచంద్రయ్య ఘాటుగా స్పందించారు. పెంపు భారం సరికాదని, ఇలాగైతే కాంగ్రెసు పార్టీ మరోసారి అధికారంలోకి రావడం కష్టమే అన్నారు. చిరంజీవి, ఆయన వర్గం విమర్శలపై కిరణ్ ఏకంగా కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు కూడా చేశారట.












Click it and Unblock the Notifications