వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్రభావితం చేస్తారు గానీ సబిత చేయరా: షర్మిల

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
విజయవాడ: వైయస్ జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ జైలులో పెట్టారని, బయట ఉంటే హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాక్షులను ప్రభావితం చేయరా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల అన్నారు. ‘‘సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు, అంతకుముందు మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు చేర్చారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం హోంమంత్రికి, మరో మంత్రికి ఉంటుందా? ఒక సాధారణ ఎంపీకి ఉంటుందా? సీబీఐ సమాధానం చెప్పాలి. సాక్షులను ప్రభావితం చేయగలిగే మంత్రులను బయట వదిలి.. ఒక సాధారణ ఎంపీ అయిన జగన్‌ను ఎందుకు జైలులో పెట్టారు? మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు... జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు గనుకేనా?'' అని ఆమె ధ్వజమెత్తారు.

జగనన్న విషయంలో సీబీఐ చెబుతున్న చందమామ కథలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని, రాజకీయంగా పతనం చేయడానికే జగన్‌ను అరెస్టు చేశారని ఆమె అన్నారు. ఈ పాపం ఊరికే పోదనిస, ఈ కుట్రలు పన్నిన వారు ఇంతకు ఇంత అనుభవిస్తాని షర్మిల విమర్శించారు. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సాగింది. హనుమాన్ జంక్షన్‌ వద్ద ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు

కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని వాడుకుని జగనన్నను జైలు పాలు చేసిందని, సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని స్వయంగా సీబీఐ మాజీ డెరైక్టర్ జోగీందర్ సింగ్ చెప్పారని ఆమె అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ - తాము గత్యంతరం లేక కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని, ఆ పార్టీని వ్యతిరేకిస్తే వేయి పడగలతో కాటేస్తుందని, సీబీఐని ఉసిగొల్పుతుందని చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సీబీఐ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరమా? అని ఆమె అడిగారు.

పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని, టి. బాలరాజు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకా ప్రతాప అప్పారావు, ముసునూరి రత్నబోస్, జేష్ట రమేష్‌బాబు, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నాయకులు ఎంవీఎస్ నాగిరెడ్డి, కుక్కల నాగేశ్వరరావు, ఉప్పులేటి కల్పన, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వసంత నాగేశ్వరరావు, స్థానిక నాయకులు దుట్టా రామచంద్రరావు తదితరులున్నారు.

English summary

 YSR Congress party leader Sharmila questioned CBI attitude for not arresting home minister Sabitha Indra Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X