బోను నుండి బయటకొచ్చి ఖడ్గమృగం హల్‌చల్

Rhinoceros hulchul in Zoo Park
విశాఖపట్నం/చిత్తూరు: విశాఖపట్నం జిల్లాలో ఓ ఖడ్గమృహం హల్ చల్ సృష్టించింది. జిల్లాలోని ఇందిరాగాంధీ జూపార్క్‌లో గేటును ధ్వంసం చేసిన ఖడ్గమృగం బోను నుండి బయటకు వచ్చి హంగామా చేసింది. ఖడ్గమృగం గేటు నుండి బయటకు రావడంతో జంతు ప్రదర్శన కాల అధికారులు సందర్శకులను బయటకు పంపించారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏనుగు దాడి

చిత్తూరు జిల్లా కుప్పం మండలం సవినేకుప్పం గ్రామంలో ఓ రైతుపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని వి.కోట మండలం కొత్తకోట సమీపంలో గ్రామస్థులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో నారాయణప్ప అనే రైతు మృతి చెందాడు. మరో పది మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

జిల్లాలోని రేణిగుంట వద్ద లారీలో తరలిస్తున్న ఎనబై లక్షల రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ

రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ మండలం కొత్తిరపల్లిలో ఓ కుక్క విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా మరో పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి.

పేకాటరాయుళ్ల అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాడెం మండలం కలరాయినిగూడంలోని పేకాట స్థావరాలపై పోలీసులు గురువారం ఉదయం దాడులు చేశారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వారి నుండి రూ.16వేల నగదును, రెండు కార్లను, 12 ద్విచక్ర వాహనాలను సవాధీనం చేసుకున్నారు. నిడదవోలు మండలంలో మరో తొమ్మిదిమందిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+