• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భర్తను గొడ్డలితో నరికిన భార్య: విద్యార్థిపై వేడినీళ్లు

By Pratap
|
Woman attacks wife, heat water on student
గుంటూరు/హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని ఈదులపల్లిలో వేధింపులు తాళలేక ఓ భార్య తాళి కట్టిన భర్తపై గొడ్డలితో దాడి చేసింది. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడ్ని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేిస దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలం అరెల్లలో దారుణం జరిగింది. ఏడో తరగతి విద్యార్థిపై ఓ ప్రైవేటు స్కూల్ కరెస్పాండెంట్ భార్య వేడినీటిని పోసి గాయపరిచింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

భార్యపై దాడి చేసిన భర్త..

సికింద్రాబాద్‌లోని కుషాయిగుడాలో అదనపు కట్నం సాకుగా చూపి భార్యను వదిలించుకోవాలని ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తల్లిదండ్రులు, బంధువులతో కలిసి భార్యపై దాడికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లాకు చెందిన డేనియల్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈయనకు ఐదుగురు సంతానం. చిన్న కూతురు స్వర్ణలతను అశోక్‌నగర్‌కు చెందిన మోహన్‌కిచ్చి 2011లో వివాహం జరిపించారు. కొంతకాలం పాటు వారి సంసార జీవితం సజావుగా కొనసాగింది. వారికి ఓ పాప జన్మించింది. పెయింటర్‌గా పనిచేసే మోహన్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.

ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అదనంగా కట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కర్నూలు వెళదామంటూ భార్యను తీసుకుని ఇంటి నుంచి బయలు దేరాడు. మల్లాపూర్ బస్టాప్ వద్దకు వచ్చాక ఇప్పుడే వస్తానంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. అర్థరాత్రి సమయంలో పసిపాపతో సుమారు గంట పాటు స్వర్ణలత వేచి చూసింది. ఎంతకూ భర్త తిరిగి రాకపోవడంతో ఇంటికి వెళ్లింది.

అక్కడ భర్త, అత్త,మామలతో పాటు మరికొంతమంది బంధువులు మద్యం తాగుతూ కనిపించారు. స్వర్ణలతను గమనించిన వారు మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆమె మంగళవారం ఉదయం జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా వారు నగరానికి చేరుకుని కుషాయిగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శంకరయ్య తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman attacked her husband at Guntur. she has been arrested. A person in Secendurabad attacked his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more