యాత్రకు ముందే షాక్: గంటాతో దాడి భేటీ, బాబు ఆరా

ఎమ్మెల్సీ సీటు మరోసారి ఆశించి భంగపడిన దాడి గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టనుంది. బాబు యాత్ర విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టే సమయంలో దాడి మంత్రి గంటా శ్రీనివాస రావుతో భేటీ కావడం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా మొత్తం చర్చనీయాంశమైంది.
ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఆయన టిడిపికి దూరం పోరని, కేవలం నియోజకవర్గ సమస్యల పైనే ఆయన గంటాతో మాట్లాడారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్రయోజనాల కోసమే గంటాతో భేటీ అయ్యారని దాడి వర్గీయులు చెబుతున్నారు. అయితే, ఆయన రాజకీయాలతో పాటు విశాఖ టిక్కెట్ పైన కూడా అడిగి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. కాగా వీరి భేటీపై చంద్రబాబు ఆరా తీసినట్లుగా సమాచారం.
బాబుకు వైద్య పరీక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడుకు ఈ రోజు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని లేదంటే జీవితాంతం బాధపడవలసి వస్తుందని సూచించారు. కాకరాపల్లిలో బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పార్టీ నేతలతో చర్చించి బాబు యాత్రపై నిర్ణయం తీసుకుంటామని గరికపాటి రామ్మోహన రావు చెప్పారు.












Click it and Unblock the Notifications